పిల్లల్లో సాధారణంగా కనిపించే ENT సమస్యలు
పాఠశాలలో చదివే పిల్లలు తరచుగా వివిధ రకాల చెవి, ముక్కు, గొంతు (ENT) సమస్యలకు గురయ్యే అవకాశముంది. ఇంకా పూర్తిగా బలపడని రోగనిరోధక శక్తి, ఇతర పిల్లలతో సన్నిహిత సంబంధం, మరియు కొన్ని శారీరక కారణాల వల్ల వీరు ఇన్ఫెక్షన్లు మరియు సంబంధిత వ్యాధులకు ఎక్కువగా లోనవుతారు. చెవి ఇన్ఫెక్షన్లు, టాన్సిల్స్, సైనసైటిస్, అలర్జీలు, వినికిడి సమస్యలు వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పిల్లల చదువు, మాట అభివృద్ధి, మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. లక్షణాలను తొందరగా గుర్తించడం మరియు వెంటనే ENT నిపుణుడిని సంప్రదించడం ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలతో పాటు దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు
గొంతు సమస్యల
1. టాన్సిలిటిస్ (Tonsillitis)
- కారణాలు: వైరస్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్.
- లక్షణాలు: గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, జ్వరం, దుర్వాసన
- చికిత్స: ఎక్కువ ద్రవాలు, ఉప్పు నీటితో గార్గిల్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయోటిక్స్.
2. క్రూప్ (Croup)
- కారణాలు: లారింక్స్, ట్రాకియాలో వైరల్ ఇన్ఫెక్షన్.
- లక్షణాలు: విపరీతమైన దగ్గు, గొంతు భారం, శ్వాసలో శబ్దం.
- చికిత్స: కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్, పిల్లను నిటారుగా కూర్చోబెట్టడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు.
ముక్కు సమస్యలు
1. సైనసైటిస్ (Sinusitis)
- కారణాలు: వైరస్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్.
- లక్షణాలు: ముఖంలో నొప్పి, గట్టి ముక్కు కారడం, దగ్గు, దుర్వాసన.
- చికిత్స: ఆవిరి పీల్చడం, నాసల్ సలైన్ వాష్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయోటిక్స్.
2. అడెనాయిడ్ హైపర్‌ట్రోఫీ (Adenoid Hypertrophy)
- లక్షణాలు: నోటి ద్వారా శ్వాస, గురక, తరచుగా చెవి ఇన్ఫెక్షన్.
- దీర్ఘకాల సమస్యలు: నిద్ర నాణ్యత, ముఖ ఆకారం, ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం.
3. అలెర్జిక్ రైనిటిస్ (Allergic Rhinitis)
- కారణాలు: దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల జుట్టు, ఇతర అలెర్జీలు.
- లక్షణాలు: తుమ్ములు, ముక్కు కారడం, కళ్ల దురద, ముక్కు బ్లాక్ అవడం.
- చికిత్స: అలెర్జీ కారకాలను దూరం పెట్టడం, యాంటీహిస్టమిన్లు, నాసల్ స్ప్రేలు.
చెవి సమస్యలు
1. ఆక్యూట్ ఓటైటిస్ మీడియా (Acute Otitis Media)
- కారణాలు: మధ్య చెవిలో వైరస్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్.
- లక్షణాలు: చెవిలో నొప్పి, జ్వరం, చిరాకు, చెవి నుంచి ద్రవం కారడం.
- ప్రమాదం: తరచుగా వస్తే వినికిడి, మాట అభివృద్ధి మీద ప్రభావం.
- చికిత్స: నొప్పి నివారణ, అవసరమైతే యాంటీబయోటిక్స్, ఫాలో-అప్.
2. గ్లూ ఇయర్ (Glue Ear)
- సమస్య: ఇన్ఫెక్షన్ లేకపోయినా చెవిపదున వెనుక ద్రవం చేరడం
- లక్షణాలు: వినికిడి తగ్గడం, మాట ఆలస్యం, చెవిలో బరువు అనిపించడం.
- చికిత్స: ఎక్కువగా స్వయంగా తగ్గుతుంది. అయితే తరచుగా ఉంటే చెవిలో ట్యూబ్ వేయాలి.
ENT సమస్యలకు ఆలస్యం ఎందుకు చేయకూడదు?
ముక్కు బ్లాకేజీ, నోటి ద్వారా శ్వాస, తరచూ జ్వరం, వినికిడి సమస్యలు లేదా దీర్ఘకాలిక దగ్గు, వంటి దీర్ఘకాల సమస్యలను నివారించవచ్చు. ఇటువంటి సమస్యలు లేదా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించండి.
మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో నిపుణుల ENT సేవలు
డా. పి. వేను గోపాల్ రెడ్డి గారి నిపుణుల మార్గదర్శకత్వంలో మా ENT విభాగం పిల్లలకు ఖచ్చితమైన నిర్ధారణ నుండి అత్యాధునిక చికిత్స వరకు పూర్తి సేవలను అందిస్తోంది.
మెడికల్ మరియు సర్జికల్ పరంగా అత్యుత్తమమైన సేవలతో పిల్లల ఆరోగ్యం, సౌకర్యం, సంపూర్ణ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాం.
FAQs
1. పిల్లలకు ENT సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తాయి?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, స్కూల్‌లో ఇతర పిల్లలతో సన్నిహితంగా ఉండటం.
2. టాన్సిల్స్ ఎప్పుడు ప్రమాదకరం అవుతాయి?
తరచూ గొంతు నొప్పి, జ్వరం, శ్వాస ఇబ్బందులు ఉంటే.
తరచూ గొంతు నొప్పి, జ్వరం, శ్వాస ఇబ్బందులు ఉంటే.
3. సైనసైటిస్ లక్షణాలు ఏమిటి?
ముక్కు బ్లాక్, ముఖ నొప్పి, దగ్గు, దుర్వాసన.
ముక్కు బ్లాక్, ముఖ నొప్పి, దగ్గు, దుర్వాసన.
4. చెవిలో తరచూ ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది?
వినికిడి తగ్గిపోవచ్చు, మాట అభివృద్ధి ఆలస్యం అవుతుంది.
వినికిడి తగ్గిపోవచ్చు, మాట అభివృద్ధి ఆలస్యం అవుతుంది.
5. అడెనాయిడ్ హైపర్‌ట్రోఫీ ఎందుకు సమస్య అవుతుంది?
ముక్కు బ్లాక్, గురక, చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
ముక్కు బ్లాక్, గురక, చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
6. అలెర్జీ ముక్కు సమస్యలు ఎలా వస్తాయి?
దుమ్ము, పుప్పొడి, జంతువుల జుట్టు వల్ల.
దుమ్ము, పుప్పొడి, జంతువుల జుట్టు వల్ల.
7. ENT సమస్యలు పిల్లల చదువుపై ప్రభావం చూపుతాయా?
అవును, వినికిడి మరియు ఆరోగ్య సమస్యల వల్ల దృష్టి తగ్గుతుంది.
అవును, వినికిడి మరియు ఆరోగ్య సమస్యల వల్ల దృష్టి తగ్గుతుంది.
8. గ్లూ ఇయర్ అంటే ఏమిటి?
చెవిలో ద్రవం చేరి వినికిడి తగ్గిపోవడం.
చెవిలో ద్రవం చేరి వినికిడి తగ్గిపోవడం.
9. ENT సమస్యలు నివారించడానికి ఏమి చేయాలి?
లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
10. MRNH లో ప్రత్యేకత ఏమిటి?
నిపుణుల నిర్ధారణ, ఆధునిక చికిత్స, పిల్లలకే ప్రత్యేక శ్రద్ధ.
నిపుణుల నిర్ధారణ, ఆధునిక చికిత్స, పిల్లలకే ప్రత్యేక శ్రద్ధ.